visitors

Monday, February 20, 2012

కలికి చిలకల కొలికి

చిత్రం:సీతా రామయ్యగారి మనవరాలు    సంగీతం: M.M. కీరవాణి
రచన: వేటూరి     పాడినవారు: చిత్ర

కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి - 2
అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు ఎరుగని పసిపంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడలిని అడగ వచ్చా నిన్ను ఆడకూతుర్ని
వాల్మికి దీవించు వరస తాతయ్య మాయింటికంపించవయ్య మామయ్యా  (కలికి)

ఆచేయి ఈ చేయి అద్దగోడలకి ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మ నాటి కోడలివి  తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మాచంటి పాపను మన్నించిపంపు (కలికి)

మసకబడితే నీకు మల్లె పూదండ తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలుతూగు నీకు ఇల్లాలు ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్య నేలేటి సాకేత రామా (కలికి)



1 comment:

  1. Thank you for the great interest and service

    Kindly mention lyricist name.

    Raveendra

    ReplyDelete