visitors

Friday, January 27, 2012

అడుగడుగున గుడి వుంది

చిత్రం: ఉండమ్మా బొట్టు పెడతా   సంగీతం: KV మహదేవన్ 
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి   పాడినవారు :సుశీల 

అడుగడుగున గుడి వుంది అందరిలో గుడి వుంది 
ఆ గుడిలో దీపముంది అదియే దైవం (అడుగడుగున)

ఇల్లూ వాకిలి ఒళ్ళూ  మనసూ  ఈశుని కొలువనిపించాలి - 2
ఎల్లవేళలా  మంచుకడిగిన మల్లెపూవులా ఉంచాలి - 2
దీపం మరిమరి వెలగాలి తెరలు పొరలు తొలగాలి (అడుగడుగున)

తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం - 2 
కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే  దైవం - 2
ప్రతి మనిషి నడిచే దైవం ప్రతి పులుగు ఎగిరే దైవం  (అడుగడుగున)




2 comments:

  1. థాంకులు చెల్లీ...అదే చేత్తో ఈ పాటలు పాడి మీ వాడికి వినిపించమని మనవి...:)

    ReplyDelete