visitors

Monday, January 23, 2012

మాటరాని మౌనమిది

చిత్రం:మహర్షి    సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:ఆత్రేయ  పాడినవారు:SP బాలు, జానకి


మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగగుండే రాగమిది (మాటరాని)

ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది  ఎప్పుడమ్మా
ఆపాలనవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ
ఈ మౌనరాగాల ప్రేమావేశం  ఏనాడో ఒకరి స్వంతం
ఆకాశాదీపాలు జాబిలి కోసం నీకెలా ఇంత పంతం
నింగినేల కూడేవేళ నీకు నాకు దూరాలేల

అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది (మాటరాని)

చైత్రాన కూసేను కోయిలమ్మ గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నెలమ్మ నీరెండకానవ్వు దేనికమ్మ
రాగలతీగల్లో వీణానాదం కోరింది ప్రణయవేదం
వేసారుగుండెల్లో రేగేగాయం పాడింది మధురగేయం
ఆకాశాన తారాతీరం అంతేలేని ఎంతోదూరం (మాటరాని)

అందరాని కొమ్మఇది కొమ్మచాటు అందమిది
కూడనిది జతకూడనిది చూడనిది మదిపాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది

1 comment: