visitors

Monday, October 29, 2012

ఓ నా ప్రియతమా

చిత్రం: నాలో వున్నా ప్రేమ                సంగీతం: కోటి
రచన: సిరివెన్నెల                          పాడినవారు: మనో, చిత్ర.




ఓ నా ప్రియతమా  అనరాదే  అప్పుడే  అంతా  క్షేమమా  అని అంటే చాలదే
మనసుని తాకి చనువుగ  పిలిచే ఈ లేఖ నువ్ చదివినా
మనకిదివరకే  పరిచయమేదో ఉందని  అనిపించినా  ఓ  ఓ  ఓ  ఓ  ( ఓ నా ప్రియతమా )


ఎన్నిసార్లు చదువుకొని మళ్ళి మళ్ళి తలచుకొని గుండె ఎంత మురిసినదో చెప్పలేను మరి
ఎంత సేపు మధనపడి మాట మాట తడుముకొని పూర్తి కాని ఊహలతో నిన్ను చేరినది
పైకి రాని  గుండె సవ్వడి ఎలాగో నీకు విన్నవించుకున్నది
ఆగని ఆశల  సాగర కెరటమిది ( ఓ నా ప్రియతమా )


తేనేలోని మధురిమలు వానలోని సరిగమలు పూలలోని ఘుమఘుమలు చేర్చి రాసినది
వేదికైన హృదయముపై వేడుకైన మధురిమవై ఆలపించు రాధికలా పలికే అష్టపది
ప్రాణమంత పాట అయినది నీకోసం సాగుతున్నపయనమే ఇది
ఆ ప్రియ రాగమే శ్వాసగా మారినది ( ఓ నా ప్రియతమా )

Thursday, April 19, 2012

చూస్తున్న చూస్తువున్నా

చిత్రం:మొగుడు      సంగీతం: బాబు శంకర్ 
రచన:సిరివెన్నెల    పాడినవారు:కార్తీక్ 


చూస్తున్న చూస్తువున్నా చూస్తూనేవున్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా 
ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్లూ నాకే తెలియని నన్ను నేనే నీలో  (చూస్తున్న)

పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి బంగారు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి 
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది పున్నమి పదహారు కళలు సిగలో పూవులుగా పెట్టి 
దేవేరిగా పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటు
నవనిధులు వధువై వస్తుంటే సాక్షాత్తు శ్రిమన్నారాయణుడే నేనైనట్టు (చూస్తున్న)

నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముడై పోతాను నువ్వు తోడైవుంటే సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యంతో ఇంద్రపదవి నెదిరిస్తాను నీ సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను 
ఏళ్లే వచ్చి వయసును మళ్ళిస్తుంటే  నేనే నీ వొళ్ళో పాపగా చిగురిస్తుంటే చూస్తున్న (చూస్తున్న)

Tuesday, April 10, 2012

పల్లకివై ఒహోం ఒహోం భారాన్ని

చిత్రం: పౌర్ణమి           సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
రచన: సిరివెన్నెల      పాడినవారు:గోపిక పూర్ణిమ


పల్లకివై ఒహోం ఒహోం భారాన్ని మొయ్యి ఒహోం ఒహోం
పాదం నువ్వై ఒహోం ఒహోం నడిపించవోయ్ ఒహోం ఒహోం
అవ్వ బువ్వ కావాలోయ్ నువ్వే ఇవ్వాలోయ్  రివ్వురివ్వున ఎగరాలోయ్ గాలిలో
తొక్కుడుబిళ్ళాటాడాలోయ్ నీలాకాశంలో చుక్కలలోకం చూడాలోయ్ చలో చలో
చలో చలో .... ఓ ఓ ఓ ఓ ఓ ......

కలవరపరిచే కలవో శిలలను మలిచే కళవో అలజడి చేసే అలవో అలరించే అల్లరివో
ఒడుపుగావేసే వలవో నడివేసవిలో చలివో తెలియదుగా ఎవ్వరివో నాకెందుకు తగిలావో
వదలనంటావు ఒంటరిగా సరే పద మహా ప్రభో
నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్


జలజల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో గలగలగల  సందడితో నా అందెలు కట్టలోయ్
చిలకల కలగీతంలో తొలితొలి గిలిగింతలలో కిలకిలకిల సవ్వడితో కేరింతలు కొట్టాలోయ్
వదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్






నమ్మవేమోగాని అందాల యువరాణి

చిత్రం: పరుగు               సంగీతం: మణిశర్మ
రచన: అనంత శ్రీరామ్     పాడినవారు: సాకేత్


నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది నాముందే మెరిసింది - 2
అందుకే అమాంతం నా మది అక్కడే నిశ్శబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా దించివేసింది -2

నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై  కాంతిని ఇస్తుంటే
చూపులు తేనేదారాలై అల్లుకుపోతుంటే రూపం ఏడువారాలై ముందర నించుంటే
ఆ సోయగాన్ని నే చూడగానే ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగా పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా (నిజంగా)

వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది
వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది శ్వాసలలోన  తలదాల్చి జాలిగా కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే  ఆనందమైన వందేళ్ళు నావే 
కలల తాకిడిని మనసు తాళదిక  వెతికి చూడు చెలిమి (నిజంగా)


Thursday, March 15, 2012

ఇక్ష్వాకుకులతిలకా

చిత్రం: శ్రీరామదాసు           సంగీతం: కీరవాణి
రచన: రామదాసు(కీర్తన)    పాడినవారు: శంకర మహదేవన్         


ఇక్ష్వాకుకులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా
ననురక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా
చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారముకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకానికి పట్టే పదివేల మొహరీలు రామచంద్రా
సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకానికి పట్టే పదివేల వరహాలు రామచంద్రా
కలికీతురాయి నీకు పొదుపుగా చేయిస్తిని రామచంద్రా
నీ తండ్రి దశరధ మహారాజు పంపెనా లేక నీమామ జనక మహారాజు పెట్టెనా
ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా  - 2

Monday, February 27, 2012

చిత్రం:ఆంధ్రుడు     సంగీతం:కళ్యాణ్ మాలిక్
రచన:చంద్రబోస్    పాడినవారు:శ్రేయ ఘోషల్


కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలోలేవమ్మ- 2
చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ పిలీల చెక్కిల్లోన వర్షించు పూలవాన
అందాల కాలాలోన జనించు తేనేసోన వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మ (కోకిలమ్మ)

ఒకే పథం ఒకే విధం కుహూ కుహూ  అదేవ్రతం అదేమతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంతగీతి వుంది అసాధ్య రీతి వుంది
చేరవమ్మ చరిత్ర మార్చుకొమ్మ శ్రమించి కొత్తపాట ఎత్తుకోమ్మ ఖరీదు కాదులెమ్మ (కోకిలమ్మ)

మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా మా వూరిలో కచేరిలో పాడాలిగా
చిన్నారి చిలక పైన సవాలు చేయ్యకమ్మ తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మ అదంత తేలికేమి కాదులేమ్మ ఎత్తాలి కొత్త జన్మ (కోకిలమ్మ)

Tuesday, February 21, 2012

హాయి హాయి హాయి

చిత్రం:తారక రాముడు     సంగీతం: కోటి 
రచన:సిరివెన్నెల           పాడినవారు: SP బాలు 


హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి 
తియ్యతియ్యనైన పాట పాడనీయి బాధ పోనీ రానీ హాయి 
చురుకుమనే మంటకు మందును పూయమని 
చిటికెలలో కలతను మాయం చేయమని 
చలువ కురిపించని ఇలా ఇలా ఈ నా పాటని (హాయి)

కనులు తుడిచేలా ఊరడించి ఊసులాడే భాషే రాదులే 
కుదురు కలిగేలా సేవజేసి సేదదీర్చే ఆశే నాదిలే 
వెంటనే నీ మది పొందనీ నెమ్మది 
అనితలచే ఎదసడిని పదమై పలికే మంత్రం వేయని (హాయి)

మొరటుతనమున్నా పువ్వులాంటి నిన్నుకాచే ముల్లై నిలవనా 
మన్నులో వున్నా చిగురువేసే నీకు నేనే వేరై ఒదగనా 
నువ్విలా  కిలకిలా నవ్వితే దివ్వెలా  
కడవరకు ఆవెలుగు నిలిపే చమురై నేనే ఉండనా (హాయి)