visitors

Thursday, April 19, 2012

చూస్తున్న చూస్తువున్నా

చిత్రం:మొగుడు      సంగీతం: బాబు శంకర్ 
రచన:సిరివెన్నెల    పాడినవారు:కార్తీక్ 


చూస్తున్న చూస్తువున్నా చూస్తూనేవున్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా 
ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్లూ నాకే తెలియని నన్ను నేనే నీలో  (చూస్తున్న)

పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి బంగారు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి 
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది పున్నమి పదహారు కళలు సిగలో పూవులుగా పెట్టి 
దేవేరిగా పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటు
నవనిధులు వధువై వస్తుంటే సాక్షాత్తు శ్రిమన్నారాయణుడే నేనైనట్టు (చూస్తున్న)

నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముడై పోతాను నువ్వు తోడైవుంటే సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యంతో ఇంద్రపదవి నెదిరిస్తాను నీ సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను 
ఏళ్లే వచ్చి వయసును మళ్ళిస్తుంటే  నేనే నీ వొళ్ళో పాపగా చిగురిస్తుంటే చూస్తున్న (చూస్తున్న)

Tuesday, April 10, 2012

పల్లకివై ఒహోం ఒహోం భారాన్ని

చిత్రం: పౌర్ణమి           సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
రచన: సిరివెన్నెల      పాడినవారు:గోపిక పూర్ణిమ


పల్లకివై ఒహోం ఒహోం భారాన్ని మొయ్యి ఒహోం ఒహోం
పాదం నువ్వై ఒహోం ఒహోం నడిపించవోయ్ ఒహోం ఒహోం
అవ్వ బువ్వ కావాలోయ్ నువ్వే ఇవ్వాలోయ్  రివ్వురివ్వున ఎగరాలోయ్ గాలిలో
తొక్కుడుబిళ్ళాటాడాలోయ్ నీలాకాశంలో చుక్కలలోకం చూడాలోయ్ చలో చలో
చలో చలో .... ఓ ఓ ఓ ఓ ఓ ......

కలవరపరిచే కలవో శిలలను మలిచే కళవో అలజడి చేసే అలవో అలరించే అల్లరివో
ఒడుపుగావేసే వలవో నడివేసవిలో చలివో తెలియదుగా ఎవ్వరివో నాకెందుకు తగిలావో
వదలనంటావు ఒంటరిగా సరే పద మహా ప్రభో
నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్


జలజల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో గలగలగల  సందడితో నా అందెలు కట్టలోయ్
చిలకల కలగీతంలో తొలితొలి గిలిగింతలలో కిలకిలకిల సవ్వడితో కేరింతలు కొట్టాలోయ్
వదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్






నమ్మవేమోగాని అందాల యువరాణి

చిత్రం: పరుగు               సంగీతం: మణిశర్మ
రచన: అనంత శ్రీరామ్     పాడినవారు: సాకేత్


నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది నాముందే మెరిసింది - 2
అందుకే అమాంతం నా మది అక్కడే నిశ్శబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా దించివేసింది -2

నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై  కాంతిని ఇస్తుంటే
చూపులు తేనేదారాలై అల్లుకుపోతుంటే రూపం ఏడువారాలై ముందర నించుంటే
ఆ సోయగాన్ని నే చూడగానే ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగా పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా (నిజంగా)

వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది
వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది శ్వాసలలోన  తలదాల్చి జాలిగా కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే  ఆనందమైన వందేళ్ళు నావే 
కలల తాకిడిని మనసు తాళదిక  వెతికి చూడు చెలిమి (నిజంగా)