visitors

Friday, April 16, 2010

ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ

ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు -౨
పల్లవించనీ నేలకూ పచనిపరవళ్ళు (ఘల్లు)
వేల్లువోచి తాకని తొలకరి అల్లర్లు - ౨
ఎల్లలన్నవే ఎరుగని వేగం తో వెళ్ళు (ఘల్లు)

లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయా నిలయమై నీ పాదం సాగాలి
వలలో వొదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనము నేర్పించే గురువేడి
తిరిగే కాలానికి ఆ.......తీరొకటుంది
అది నీ పాదానికి దొరకను అంది
నటరాజస్వామి జటా జూటి లోకి చేరకుంటే
విరుచుకుపడు సురగంగకు విలువేముంది ..........విలువేముంది (ఘల్లు)

దూకే అలలకు ఎతాళం వేస్తారు
కమ్మని కళల పాత ఎ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవిత పరమార్థం
వద్దని ఆపలేరు ఆ .......-౨ ఊరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనమున పరిమళములవిలువేముంది.....విలువేముంది (ఘల్లు)

తెలవారదేమో స్వామి

తెలవారదేమో స్వామి......
నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకూ....(తెలవర)

చేలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు - ౨
కళల అలజడిన నిద్దుర కరవై ......అలసిన దేవరి -౨ అలమేలు మంగకు (తెలవార)

మక్కువమీరగా అక్కున జేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్చగ -౨
ఆ మత్తునే మది మరి మరి తలచగ -౨ .......అలసిన దేవేరి - ౨ అలమేలు మంగకు (తెలవార)

జోరు మీదున్నావు తుమ్మెద

జోరు మీదున్నావు తుమ్మెద.....నీ జోరెవరికోసమే తుమ్మెదా -౨
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెద........ నీ వొళ్ళు జాగరతె తుమ్మెదా -౨

ముస్తాబు అయినావు తుమ్మెద.....కస్తూరి రాసవే తుమ్మెదా
మసకవెంనేల్లోన తుమ్మెద.......మల్లె పందిరిలోన తుమ్మెదా
మాల కడుతున్నవే తుమ్మెద........ఈ మాలేవరికోసమే తుమ్మెదా (జోరు)

మెత్తన్ని పరుపులూ తుమ్మెదా ......గుప్తంగా కట్టావు తుమ్మెదా
మెత్తన్ని పరుపుపై తుమ్మెదా......అత్తర్లు చల్లావు తుమ్మెదా
పక్కవేసున్చావు తుమ్మెదా.......ఈ పక్కేవరికోసమే తుమ్మెదా.....(జోరు)

రవివర్మ కే అందని

రవివర్మ కే అందని ఒకే ఒక అందానివో
రావిచూదని పాడని నవ్య రాగానివో (రవి)

ఏ రాగమో తీగాదాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలూ అనురాగ మోహాలై
నీ పాటలే పాడనీ ( రవి)

ఏజగనమో కురులచేరి మేలిమైపోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే
ఆ కావ్య కల్పన లో నీ దివ్య శిల్పాలై
కదలాడనీ పడనీ (రవి)

ఏ తీగ పూవును

ఏ తీగ పూవును ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో (ఏ తీగ)

మనసు మూగది మాటలు రానిది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది
భాషలేనిది బంధమున్నది -౨
మన ఇద్దర్నీ జత కూర్చినది -౨ ( ఏ తీగ)

వయసే వయసును పలకరించునది వలదన్న అది నిలువనన్నది
ఎల్లలు ఏవీ వల్లనన్నది -2
నీదీ నాదొక లోకమన్నది -౨ (ఏ తీగ )

తోలిచూపే నను నిలిపివేసినది నీ రూపై అది కలవరించినది
మొదటి కలయికే ముడివేసినది -౨
తుది దాకా ఇది నిలకడైనది- ౨ (ఏ తీగ)

Thursday, April 15, 2010

సంగీత సాహిత్య సమలంకృతే

సంగీత సాహిత్య సమలంకృతే
స్వరరాజ పదయోగ సమ భూషితే
హే భారతి మనసా స్మరామి
శ్రీ భారతి శిరసా నమామి (సంగీత)

వేద వేదాంత వనవాసిని పూర్ణ ససి హాసిని
నాదనాదంతా మున్వేషిణి ఆత్మా సంచారిణి (వేద)
వ్యాస వాల్మికి వాగ్ధయిని - ౨

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి -౨ భవ్య వరదాయిని
నిత్య చైతన్య నిజ రూపిని సత్య సంజీవిని (బ్రహ్మ)
సకల సుకలా సమన్వేషిణి - ౨
స్వర రసభావ సంవేదిని

తులసి దళముల చే

తులసి దళముల చే సంతోషముగా పూజింతు -6
పలుమారు చిరకాలము-౨
పరమాత్ముని పాదములను
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను (తులసి )

సరసీరుహ పున్నాగ చంపక బాలతల కురవక -2
కరవీర మల్లికా సుగంధ రాజ సుమముల - ౨
ధరణిని ఒక పర్యాయము ధర్మాత్ముని - ౨
సాకేతపుర వాసుని శ్రీరాముని - ౨
వర త్యాగ రాజ నుతుని (తులసి)

Friday, April 2, 2010

హిమగిరి సొగసులు

హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చిగురించునేవో ఊహలు

యోగులైన మహా భోగులైన మనసుపడే మనోజ్ఞా సీమ
ఆ ఆ ఆ ఆ
సురవరులు సరాగాల చేలులూ కలసీ సొలసే అనురాగ సీమ (హిమ)

ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించేనేమో
ఆ ఆ ఆ ఆ
సుమశరుడు రతీదేవి చేరి కేళి తేలి లాలించేమో (హిమ)

ఊహలు గుస గుస లాడే

ఊహలు గుస గుస లాడే నా హృదయము ఊగిసలాడే
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
తోలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు (ఊహలు)

నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేల
మీ యానతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా
దివి మల్లె పందిరి వేసే
భూమి పెళ్లి పీటలు వేసే
వెన్నెలలు కురిపించు నెలరాజు పెండ్లిని చేసే (ఊహలు)

Thursday, April 1, 2010

నా హృదయం లో నిదురించే చెలి

నా హృదయం లో నిదురించే చెలి
కలల లోనే కవ్వించే సఖి
మయురివై వయారివై నటనమాడి నీవే
నన్ను దోచినావే ( నా )

నీ కన్నులలోన దాగేనులే వెన్నెల సోనా -౨
చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే (నా)

నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే - ౨
పల్లవిగా పలకరించి రావే .....

నీ వేచని నీడ వెలిసేను నా వలపుల మేడ - ౨
నివాలితో చేయి సాచి ఎదురు చూసినానే నిదుర కాచినానే ( నా)