visitors

Monday, February 27, 2012

చిత్రం:ఆంధ్రుడు     సంగీతం:కళ్యాణ్ మాలిక్
రచన:చంద్రబోస్    పాడినవారు:శ్రేయ ఘోషల్


కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలోలేవమ్మ- 2
చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ పిలీల చెక్కిల్లోన వర్షించు పూలవాన
అందాల కాలాలోన జనించు తేనేసోన వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మ (కోకిలమ్మ)

ఒకే పథం ఒకే విధం కుహూ కుహూ  అదేవ్రతం అదేమతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంతగీతి వుంది అసాధ్య రీతి వుంది
చేరవమ్మ చరిత్ర మార్చుకొమ్మ శ్రమించి కొత్తపాట ఎత్తుకోమ్మ ఖరీదు కాదులెమ్మ (కోకిలమ్మ)

మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా మా వూరిలో కచేరిలో పాడాలిగా
చిన్నారి చిలక పైన సవాలు చేయ్యకమ్మ తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మ అదంత తేలికేమి కాదులేమ్మ ఎత్తాలి కొత్త జన్మ (కోకిలమ్మ)

Tuesday, February 21, 2012

హాయి హాయి హాయి

చిత్రం:తారక రాముడు     సంగీతం: కోటి 
రచన:సిరివెన్నెల           పాడినవారు: SP బాలు 


హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి 
తియ్యతియ్యనైన పాట పాడనీయి బాధ పోనీ రానీ హాయి 
చురుకుమనే మంటకు మందును పూయమని 
చిటికెలలో కలతను మాయం చేయమని 
చలువ కురిపించని ఇలా ఇలా ఈ నా పాటని (హాయి)

కనులు తుడిచేలా ఊరడించి ఊసులాడే భాషే రాదులే 
కుదురు కలిగేలా సేవజేసి సేదదీర్చే ఆశే నాదిలే 
వెంటనే నీ మది పొందనీ నెమ్మది 
అనితలచే ఎదసడిని పదమై పలికే మంత్రం వేయని (హాయి)

మొరటుతనమున్నా పువ్వులాంటి నిన్నుకాచే ముల్లై నిలవనా 
మన్నులో వున్నా చిగురువేసే నీకు నేనే వేరై ఒదగనా 
నువ్విలా  కిలకిలా నవ్వితే దివ్వెలా  
కడవరకు ఆవెలుగు నిలిపే చమురై నేనే ఉండనా (హాయి) 
 

యమునా తటిలో

చిత్రం:దళపతి     సంగీతం:ఇళయరాజా
రచన:వేటూరి      పాడినవారు:స్వర్ణలత


యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా
రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
యదుకుమారుడే లేనివేళలో వెతలు రగిలినే రాధ గుండెలో - 2
పాపం రాధా (యమునా)

Monday, February 20, 2012

కలికి చిలకల కొలికి

చిత్రం:సీతా రామయ్యగారి మనవరాలు    సంగీతం: M.M. కీరవాణి
రచన: వేటూరి     పాడినవారు: చిత్ర

కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి - 2
అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు ఎరుగని పసిపంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడలిని అడగ వచ్చా నిన్ను ఆడకూతుర్ని
వాల్మికి దీవించు వరస తాతయ్య మాయింటికంపించవయ్య మామయ్యా  (కలికి)

ఆచేయి ఈ చేయి అద్దగోడలకి ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మ నాటి కోడలివి  తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మాచంటి పాపను మన్నించిపంపు (కలికి)

మసకబడితే నీకు మల్లె పూదండ తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలుతూగు నీకు ఇల్లాలు ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్య నేలేటి సాకేత రామా (కలికి)



Tuesday, February 14, 2012

మనసా వాచా నిన్నే వలచా

చిత్రం:గోదావరి     సంగీతం: KM రాధాకృష్ణన్
రచన: వేటూరి     పాడినవారు: ఉన్ని కృష్ణన్, K.S. చిత్ర

మనసావాచా నిన్నేవలచా నిన్నే ప్రేమించా 
నిన్నే తలచా నను నే మరిచా నీకై జీవించా 
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా (మనసా)


చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో  నిన్ను చూసి నీ వశమై మనసు 
కన్నేరైన గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా  

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్న 
కన్నుచీకటై  కలలు వెన్నెలై కాటేస్తున్న 
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా 
రాముని కోసం సీతలా 

Friday, February 10, 2012

రామచక్కని సీతకి

చిత్రం:గోదావరి     సంగీతం: KM రాధాకృష్ణన్
రచన:వేటూరి      పాడినవారు: గాయత్రి


నీలగగన ఘనవిజనన ధరణిజ శ్రీ రమణ 
మధుర వదన నళిన నయన మనవి వినరా రామా 

రామచక్కని సీతకి అరచేత గోరింట ఇంతచక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట 

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే 
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే 
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో 

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే 
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే 
నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడే

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా 
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా (రామ)

ఇందువదనా కుందరదనా మందగమనా భామ
ఎందువలనా ఇందువదనా ఇంత మదనా ప్రేమ



Thursday, February 2, 2012

ఎందుకు చెంతకి వస్తావో

చిత్రం: కొంచెం ఇష్టం కొంచెం కష్టం    సంగీతం: శంకర్ ఎహ్సాన్ లోయ్ 
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి   పాడినవారు: ఉన్ని కృష్ణన్


ఎందుకు చెంతకి వస్తావో  ఎందుకు చెయ్యోదిలేస్తావో  స్నేహమా చెలగాటమా 
ఎప్పుడు నీ ముడివేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా 
శపించే దైవమా దహించే దీపమా ఇదే నీ రూపమా ప్రేమా 
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమా 

ఈ  కలతా    కాలే  మమతా 
మరపు రాని స్మ్రుతులలోనే రగిలి పోతావా 
మరలిరాని గతముగానే మిగిలి పోతావా 
రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు ఊరుకో ఓ హృదయమా 
నిజం నిష్టూరమా తెలిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమా (ఫలిస్తే) 

వెంటరమ్మంటూ తీసుకెలతావు  నమ్మివస్తే నట్టడివిలో విడిచిపోతావు 
జంటకమ్మంటూ ఆశ పెడతావు కలిపిఉంచే చెలిమితుంచే కలహమౌతావు 
చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా మమకారమా 
చూపుల్లో శూన్యమా  గుండెల్లో గాయమా మరీ వేధించకే  ప్రేమా (ఎందుకు)