visitors

Wednesday, March 31, 2010

లాహిరి లాహిరి లాహిరిలో ......

లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా......ఆ...ఆ...ఆ....

తార చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల వోరవడిలో....
పూలవలపులో ఘుమ ఘుమ లాడే పిల్లవాయువుల లాలనలో
అల్లాల ఊహలో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో మిలమిలలో
మైమరపించే ప్రేమ నౌకలో హాయిగా చేసి విహరణలో....

ఆకాశ వీధిలో ...

ఆకాశ వీధిలో అందాల జాబిలీ వయ్యారి తారను చేరి
వుయ్యలలూగేనే సయ్యాట లాడెనే .......(ఆకాశ)

జలతారు మేలిమబ్బు పరదాలు వేసి తెరచాటు చేసి
పొలిమేర దాగి దాగి పంతాలు పోయి సరదాలు చేసి
అందాల చందమామ దొంగాటలాడెనే.....దోబూచులాడెనే......(ఆకాశ)

జడివాన హోరుగాలి సుడిరేగిరాని జడిపించబోని
కలకాలం నీవే నేనని పలుబాసలాడి చెలిచెంత చేరి
అందాల చందమామ అనురాగం దాచేనే నయగారం చేసెనే.....(ఆకాశ)

కనులు కనులతో కలబడితే

కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి ......కలలే
ఆ కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి ..........మరులే
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి .....మనువు
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి .......సంసారం

అల్లరి ఏదో చేసితివి చల్లగా ఎదనే దోచితివి - ౨
ఏమిలేని పేదయని నాపై మోపకు నేరాన్ని
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం -౨
నింగి నెలకు కడు దూరం మన ఇద్దరి కలయిక విడ్డురం (కనులు)

ముద్దా బంతి పూవులో

ముద్దా బంతి పూవులో మూగ కళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే....(ముద్దా)

పూల దండ లో దారం దాగుందని తెలుసు
పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా .....(ముద్దా)

మనసు మూగాడే కాని బాసున్నది దానికి
చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది
ఎద మీద ఎదపెట్టి సోదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో...(ముద్దా )

ముక్కోటి దేవతలు మురిసీ చూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముదిఎసి పెడతారు
కన్నోల్లు కన్నీళ్లు కడుపు తీపి దీవెనలు
ఈ మూగమనసు బాసలు మీ ఇద్దరికీ సేవలు .....(ముద్దా)

కలవరమాయే మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నుల లోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నుల లోన గారడీ ఆయే మనసే పూల మంటపమాయే (కల)

నాలో ఏయే నవభావనగా మెల్లగా వీణ మ్రోగింది -౨
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే (కలవరమాయే)

నాలో ఏమో నవరస రాగం పిల్లనగ్రోవి ఊదింది -౨
మొహాలేవో మూపులు చేసి ఊహాగానం చేసే (కలవరమాయే)

మనసు పరిమళించెనే

మనసు పరిమళించెనే తనువూ పరిమళించెనే
నవ వసంత గానముతో నీవు చెంత నిలువగానే...2

నీకు నాకు స్వాగతముగా కోయిలమ్మ కూయగ ఆ ఆ ...౨
గల గల సెలయేరులలో కలకలములు రేగగా ( మనసు )

క్రొత్త పూల నేతవులతో మత్తు గాలి వీచగా ఆ ఆ -౨
భ్రమరమ్ములు గుబులు గుబులు ఝుం ఝుం న పాడగా ( మనసు)

Tuesday, March 30, 2010

నీలి మేఘాలలో

నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాత వినిపించు ఈ వేళ

ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి
అపురూపమై నిలిచేనే నా అంతరంగాన ( నీలి )

నీ చెలిమి లోనున్న నెత్తావి మధురాలు
నా హృదయ భారమునే మురిపింపజేయు ( నీలి )

అందుకో జాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమవుతావు ( నీలి )

అలిగిన వేలనే

అలిగిన వేలనే చూడాలి
గోకుల కృష్ణుని అందాలు...(అలీ)

అల్లన మెల్లన నల్ల పిల్లివలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లున - ౨
తల్లిమేలుకొని దొంగను చూసి అల్లరి ఏమని అడిగినందుకే ( అలీ)

మోహన మురళి గానమునిడగా తహతహ లాడుచు తరుణులు రాగ - ౨
ద్రిస్టి తగులునని జడిసి యశోద తనని చాటుగా దాచినందుకే (అలీ)

పగలే వెన్నెలా

పగలే వెన్నెలా జగమే ఊయల
కదిలే ఊహలకే కన్నులుంటే .......(పగలే)

నింగిలోన చందమామ తొంగిచూసే
నీటిలోన కలువభామ పొంగిపూచే
ఈ అనురాగమే జీవన రాగమై -౨
ఎదలో తేనేజల్లు కురిసిపోదా...(పగలే)

కడలి పిలువా కన్నేవాగు పరుగుతీసే
మురళి పాట విన్న వాగు శిరసునూపే
ఈ అనుబంధమే మధురానందమై - ౨
ఇలపై నందనాలు నిలిపిపోదా...(పగలే)

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూలరుతువు సైగ చూసి పికము పాడే
మనసే వీణగా ఝాన ఝాన మ్రోగగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోడా....

Sunday, March 28, 2010

ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిలచిపోయేనే ( ఏ దివిలో )
నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాచి నిలిచేనే .....

పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంమ్స లా రావే ....( ఏ దివి)

నిదుర మబ్బులను మెరుపు తీగవై కళలు రేపినది నీవే
బ్రతుకు వీణ పై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
పదము పదము పై మధువు పారుతూ కావ్య కన్యలా రావే.....( ఏ దివి)

Saturday, March 27, 2010

మెల్లగా మెల్లగా తట్టి

మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకో అంటూ తూరుపు వెచగా చేరంగా
సండే సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచి తలపుల తలుపులే తీయంగా
ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం తాకగా
అల మేలుకున్నది ఇలా నేలుతున్నది (మెల్లగా)

చిట్ చిట్ చిట్ చిట్ చిట్టి పొట్టి పిచుక చిత్రం గ ఎగిరే రెక్కలు ఎవరిచారు
ఫట్ ఫట్ ఫట్ ఫట్ పరుగుల సీతాకోక పదహారు వన్నెలు నీకు ఎవరిచారు
కొమ్మమీది కోయిలమ్మ నన్నుచుసి పాడుతోంది గొంతు కాస్త శ్రుతి చేసి
మధుమసమై వుంటే ఎద సంతోషమే కదా సదా
అమ్మమ్మా...... మబ్బుల తలుపులున్న వాకిలి రమ్మంటోంది నింగి లోగిలి (మెల్లగా)

తుల్ తుల్ తుల్ తుల్ తుళ్ళే వుడుత మెరుపల్లె ఊరికే వేగం ఎవరిచారు
జల జల జల జల పారే ఎరా ఎవరమ్మా నీకీరాగం నేర్పించారు
కొండపల్లి కొనకిచే పాలేమో ఉరుకుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగే దాక తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్ట దాహం
మధుమాసమే ఉంటే ఎద సంతోషమే కదా సదా
అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి రమ్మంటోంది నింగి లోగిలి (మెల్లగా)