visitors

Monday, December 26, 2011

marala telupanaa

మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా -2 
ఎదలోయల దాచుకున్న మదురోహాల  పరిమళాన్ని -2 
కనుపాపల నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని (మరల)

విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని -2 
ఆణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని (మరల)

నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయచూసి -2 
మాటరాని మౌనమేదో పెదవి మీద వొదిగి పోయే
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ(మరల)


సీతాసీమంతం

సీతాసీమంతం రంగరంగ వైభవములే 
ప్రేమాఆనందం నింగినేల సంబరములే 
కోసల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే
పున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే 
మన శ్రీరాముని  ముద్దుల రాణి సీతమ్మవుతోందే (సీతా సీమంతం )

అమ్మలక్కలంతచేరి చమ్మచెక్క లాడిపాడి చీరలిచ్చి సారేలిచ్చిరే 
జుట్టుదువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్తగారు దగ్గరయ్యేనే -2
కాశ్మీరమే కుంకుమ పువ్వే  కావిళ్ళతో పంపే
కర్నాటక రాజ్యం నుంచి కస్తురియే చేరే 
అరె వద్దు వద్దు అంటున్న ముగ్గురక్కలు కూడి  ఒక్కపని చేయ్యనివ్వరే (సీత సీమంతం )

పుట్టినింటివారువచ్చి  దగ్గరుండి ప్రేమతోటి పురుడు పోసినట్టు జరుగులే
 మెట్టినింటివారు నేడు పట్టరాని సంబరం తో పసుపు కుంకుమిచ్చినట్టులే
 రామనామ కీర్తనలతో మారుమోగు ఆశ్రమాన కానుపింక తేలికవునులే
అమ్మకడుపు చల్లగాను అత్తాకడుపు చల్లగాను తల్లిబిడ్డలిల్లు చేరులే 
ముతైదుల ఆశీస్సులతో అంతానీకు శుభమే 
అటుఇటు బంధంఉన్న చుట్టాలంత మేమే 
ఎక్కడున్నా నువ్వుగాని చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడు

దేవి సీమంతం సంతసాల వంత పాడేనే 
ప్రేమా ఆనదం గుండెలోన నిండిపోయెనే 
అంగనలందరు కలిసి కోమలికి మంగళహారతులనిరే
వేదము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెన లొసగె
శుభ యోగాలతో వెలిగే సాగే సుతునే కనవమ్మ (దేవి) 
 
 

  

Friday, December 23, 2011

seetha raama charitham

సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం
గానం జన్మసఫలం శ్రవణం పాపహరణం
ప్రతి పద పదమున శ్రుతిలయాన్వితం
చతుర్వేద వినుతం లోక విదితం ఆదికవి వాల్మీకి రచితం ( శ్రీ సీతారామ)
కోదండ పాణి ఆ దండకారన్యమున కొలువుండే భార్యతో నిండుగా - 2
అండదండగా తమ్ముడుండగా కడలి తల్లికి కనుల పండుగా
సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్ఫనక
సుద్దులు తెలిపి పోమ్మనిన హద్దులు మీరి పైబాడగా
తప్పనిసరియై లక్ష్మనుడే ముక్కు చెవులను కోసే
అన్నా చూడను అక్కసు కక్కుచు రావను చేరెను రక్కసి
దారుణముగా మాయ చేసే రావణుడు మాయ లేడి అయినాడు మారీచుడు
సీత కొరకు దాని వెనుక పరుగిడి శ్రీరాముడు అదను చూసి సీతని అపహరించే రావణుడు
కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి కరకు గుండె రాకాసుల కాపలాగా వుంచి
శోకజలధి తానైనది వైదేహి ఆ శోకజలధి లో మునిగే దాశరధి
సీతా సీతా ----ఆ ఆ ఆ సీతా సీతా అని సీత కి వినిపించేలా
రోదసి కంపించేలా రోదించే సీతాపతి
రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే
సీత కెందుకీ విషాదం రామునికేలా వియోగం
కమల నయనములు మునిగే పొంగే కన్నిటిలో
చూడలేక సూర్యుడే దూకేను మున్నేటిలో-2
వానరరాజగు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి
జలధిని దాటి లంకను చేరగా కనబదేనక్కడ జానకి
రాముని ఉంగరమామ్మకు ఇచ్చి రాముని మాటల వోదార్చి
లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి
చూసినదంతా చేసినదంతా తెలిపే పూసగుచ్చి
వాయు వేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా
బాణ వేగమున రామభద్రుడా రావను తల పడగోట్టేరా
ముదముగా చేరిన కులసతి సీతని దూరముగా నిలబెట్టేరా
అంత బాధపడి సీతకోసమని ఇంత చేసి శ్రీరాముడు
చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష -2
శ్రీరాముని భార్యకా శీల పరీక్ష
అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష
దశరధుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రానానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈలోకం నోటికా
ఎవ్వరికీ పరీక్షా ఎందుకు ఈ పరీక్షా శ్రీరామా శ్రీరామా
అగ్గిలోకి దూకే అవమానముతో సతి -2
నిగ్గుదేలి సిగ్గుపడే సందేహపు జగతి
అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్మోగాగా
సీత మహా పతివ్రతని జగమే ప్రనమిల్లగా
లోకులందరికి సీత పునీతని చాటే నేటి శ్రీరాముడు
ఆ జానకి తో అయోధ్య కేగెను సకల ధర్మ సందీపుడు
సీత సమేత శ్రీరాముడు

Friday, December 16, 2011

SRI RAMA LERA O RAMA....

శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెనుచీకటి మాపగా రా
సీతారామ చూపి నీ మహిమ మదిలో అసురాలిని మాపగా రా
మద మత్సర క్రోధములే మా నుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా (శ్రీ రామ )

దరిశనమునుకోర దరికేచేరే దయగల మా రాజు దాశరధి
తొలుతనే ఎదురేగి కుశలములడిగి హితమును గావించె ప్రియవారి
ధీర మతిని న్యాయ పతిని ఏలు రఘుపతి ఏ
ప్రేమ స్వరమై స్నేహ కరమై మేలు వోసుగునులే
అందరు ఒకటేలే రామునికి ఆదరం ఒకటేలే
సకల గుణ ధాముని రీతిని రాముని నీటిని ఏమని పోగాడుదులే ( మా శ్రీ రామ )

తాంబూల రాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం
శృంగార శ్రీరామ చంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం
మౌనం కూడా మధురం సమయం అంత సఫలం
ఇది రామ ప్రేమ లోకం ఇలా సాగి పోవు స్నేహం
ఇందులోనే మోక్షం రవి చంద్రులింక సాక్ష్యం
ఏనాడు వీడిపోనీ బంధం

శ్రీరామ రామా రఘురామ పిలిచే సమ్మోహన సుస్వరమా
సీతా భామ ప్రేమారాధనమా హరికే హరిచందన బంధనమా
శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రిజానకి అనువాదం
ఏనాడు వీడి పోనీ బంధము ...