visitors

Monday, May 24, 2010

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చుపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం........(నీ కళ్ళతోటి)

అడుగునౌతాను నీవెంట నేను తోడుగా నడవగా చివరిదాకా
గొడుగునౌతను ఇకపైన నేను వానలో నిన్నిలా తడవనీక
నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను చిరునవ్వు నౌతాను పెదవంచున
నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళ లోన తోలి సిగ్గు నేనవ్వనా.......(నీ కళ్ళతోటి)

వెన్నేలౌతాను ప్రతి రేయి నేను చీకటే నీదరికి చేరకుండా
వూపిరౌతాను నీలోన నేను ఎన్నడు నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడు కుంటూ నేనుండి పోతాను పారాణి లా
చిరు చెమట పడుతుంటే నీ నుదుటి పైన వస్తాను చిరుగాలి లా.......(నీ కళ్ళతోటి)

ఓ నేనే ఓ నువ్వని

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రానీ
నీ వెంటే ఇక నేనని నీ జంటే వున్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని పోల్చానేనా లోకాన్ని నీ వాణ్ణి ........(ఓ నేనే )

మారము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకేనే
నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచు లాడెను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా............(ఓ నేనే )

నీ నీడలాగ నీతోనే వున్నా నీ జంట నేనవ్వనా
వేరేవ్వరున్న నీ గుండెలోన నా కంట నీరాగునా
ఆ తలపు నా ఊహ కే తోచునా నా శ్వాస నిను వీడి జీవించున
నీ కంటి పాపల్లె నే లేన ........(ఓ నేనే)