visitors

Friday, April 16, 2010

ఏ తీగ పూవును

ఏ తీగ పూవును ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో (ఏ తీగ)

మనసు మూగది మాటలు రానిది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది
భాషలేనిది బంధమున్నది -౨
మన ఇద్దర్నీ జత కూర్చినది -౨ ( ఏ తీగ)

వయసే వయసును పలకరించునది వలదన్న అది నిలువనన్నది
ఎల్లలు ఏవీ వల్లనన్నది -2
నీదీ నాదొక లోకమన్నది -౨ (ఏ తీగ )

తోలిచూపే నను నిలిపివేసినది నీ రూపై అది కలవరించినది
మొదటి కలయికే ముడివేసినది -౨
తుది దాకా ఇది నిలకడైనది- ౨ (ఏ తీగ)

No comments:

Post a Comment