visitors

Monday, May 24, 2010

ఓ నేనే ఓ నువ్వని

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రానీ
నీ వెంటే ఇక నేనని నీ జంటే వున్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని పోల్చానేనా లోకాన్ని నీ వాణ్ణి ........(ఓ నేనే )

మారము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకేనే
నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచు లాడెను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా............(ఓ నేనే )

నీ నీడలాగ నీతోనే వున్నా నీ జంట నేనవ్వనా
వేరేవ్వరున్న నీ గుండెలోన నా కంట నీరాగునా
ఆ తలపు నా ఊహ కే తోచునా నా శ్వాస నిను వీడి జీవించున
నీ కంటి పాపల్లె నే లేన ........(ఓ నేనే)

No comments:

Post a Comment