చిత్రం: పరుగు సంగీతం: మణిశర్మ
రచన: అనంత శ్రీరామ్ పాడినవారు: సాకేత్
నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది నాముందే మెరిసింది - 2
అందుకే అమాంతం నా మది అక్కడే నిశ్శబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా దించివేసింది -2
నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనేదారాలై అల్లుకుపోతుంటే రూపం ఏడువారాలై ముందర నించుంటే
ఆ సోయగాన్ని నే చూడగానే ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగా పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా (నిజంగా)
వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది
వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది శ్వాసలలోన తలదాల్చి జాలిగా కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే
కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలిమి (నిజంగా)

మంచిపాట. ధన్యవాదాలండి.
ReplyDeleteur more than welcome...
Delete