visitors

Wednesday, March 31, 2010

ముద్దా బంతి పూవులో

ముద్దా బంతి పూవులో మూగ కళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే....(ముద్దా)

పూల దండ లో దారం దాగుందని తెలుసు
పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా .....(ముద్దా)

మనసు మూగాడే కాని బాసున్నది దానికి
చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది
ఎద మీద ఎదపెట్టి సోదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో...(ముద్దా )

ముక్కోటి దేవతలు మురిసీ చూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముదిఎసి పెడతారు
కన్నోల్లు కన్నీళ్లు కడుపు తీపి దీవెనలు
ఈ మూగమనసు బాసలు మీ ఇద్దరికీ సేవలు .....(ముద్దా)

No comments:

Post a Comment