visitors

Tuesday, March 30, 2010

పగలే వెన్నెలా

పగలే వెన్నెలా జగమే ఊయల
కదిలే ఊహలకే కన్నులుంటే .......(పగలే)

నింగిలోన చందమామ తొంగిచూసే
నీటిలోన కలువభామ పొంగిపూచే
ఈ అనురాగమే జీవన రాగమై -౨
ఎదలో తేనేజల్లు కురిసిపోదా...(పగలే)

కడలి పిలువా కన్నేవాగు పరుగుతీసే
మురళి పాట విన్న వాగు శిరసునూపే
ఈ అనుబంధమే మధురానందమై - ౨
ఇలపై నందనాలు నిలిపిపోదా...(పగలే)

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూలరుతువు సైగ చూసి పికము పాడే
మనసే వీణగా ఝాన ఝాన మ్రోగగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోడా....

No comments:

Post a Comment