visitors

Friday, December 23, 2011

seetha raama charitham

సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం
గానం జన్మసఫలం శ్రవణం పాపహరణం
ప్రతి పద పదమున శ్రుతిలయాన్వితం
చతుర్వేద వినుతం లోక విదితం ఆదికవి వాల్మీకి రచితం ( శ్రీ సీతారామ)
కోదండ పాణి ఆ దండకారన్యమున కొలువుండే భార్యతో నిండుగా - 2
అండదండగా తమ్ముడుండగా కడలి తల్లికి కనుల పండుగా
సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్ఫనక
సుద్దులు తెలిపి పోమ్మనిన హద్దులు మీరి పైబాడగా
తప్పనిసరియై లక్ష్మనుడే ముక్కు చెవులను కోసే
అన్నా చూడను అక్కసు కక్కుచు రావను చేరెను రక్కసి
దారుణముగా మాయ చేసే రావణుడు మాయ లేడి అయినాడు మారీచుడు
సీత కొరకు దాని వెనుక పరుగిడి శ్రీరాముడు అదను చూసి సీతని అపహరించే రావణుడు
కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి కరకు గుండె రాకాసుల కాపలాగా వుంచి
శోకజలధి తానైనది వైదేహి ఆ శోకజలధి లో మునిగే దాశరధి
సీతా సీతా ----ఆ ఆ ఆ సీతా సీతా అని సీత కి వినిపించేలా
రోదసి కంపించేలా రోదించే సీతాపతి
రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే
సీత కెందుకీ విషాదం రామునికేలా వియోగం
కమల నయనములు మునిగే పొంగే కన్నిటిలో
చూడలేక సూర్యుడే దూకేను మున్నేటిలో-2
వానరరాజగు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి
జలధిని దాటి లంకను చేరగా కనబదేనక్కడ జానకి
రాముని ఉంగరమామ్మకు ఇచ్చి రాముని మాటల వోదార్చి
లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి
చూసినదంతా చేసినదంతా తెలిపే పూసగుచ్చి
వాయు వేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా
బాణ వేగమున రామభద్రుడా రావను తల పడగోట్టేరా
ముదముగా చేరిన కులసతి సీతని దూరముగా నిలబెట్టేరా
అంత బాధపడి సీతకోసమని ఇంత చేసి శ్రీరాముడు
చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష -2
శ్రీరాముని భార్యకా శీల పరీక్ష
అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష
దశరధుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రానానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈలోకం నోటికా
ఎవ్వరికీ పరీక్షా ఎందుకు ఈ పరీక్షా శ్రీరామా శ్రీరామా
అగ్గిలోకి దూకే అవమానముతో సతి -2
నిగ్గుదేలి సిగ్గుపడే సందేహపు జగతి
అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్మోగాగా
సీత మహా పతివ్రతని జగమే ప్రనమిల్లగా
లోకులందరికి సీత పునీతని చాటే నేటి శ్రీరాముడు
ఆ జానకి తో అయోధ్య కేగెను సకల ధర్మ సందీపుడు
సీత సమేత శ్రీరాముడు

No comments:

Post a Comment