visitors

Monday, December 26, 2011

సీతాసీమంతం

సీతాసీమంతం రంగరంగ వైభవములే 
ప్రేమాఆనందం నింగినేల సంబరములే 
కోసల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే
పున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే 
మన శ్రీరాముని  ముద్దుల రాణి సీతమ్మవుతోందే (సీతా సీమంతం )

అమ్మలక్కలంతచేరి చమ్మచెక్క లాడిపాడి చీరలిచ్చి సారేలిచ్చిరే 
జుట్టుదువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్తగారు దగ్గరయ్యేనే -2
కాశ్మీరమే కుంకుమ పువ్వే  కావిళ్ళతో పంపే
కర్నాటక రాజ్యం నుంచి కస్తురియే చేరే 
అరె వద్దు వద్దు అంటున్న ముగ్గురక్కలు కూడి  ఒక్కపని చేయ్యనివ్వరే (సీత సీమంతం )

పుట్టినింటివారువచ్చి  దగ్గరుండి ప్రేమతోటి పురుడు పోసినట్టు జరుగులే
 మెట్టినింటివారు నేడు పట్టరాని సంబరం తో పసుపు కుంకుమిచ్చినట్టులే
 రామనామ కీర్తనలతో మారుమోగు ఆశ్రమాన కానుపింక తేలికవునులే
అమ్మకడుపు చల్లగాను అత్తాకడుపు చల్లగాను తల్లిబిడ్డలిల్లు చేరులే 
ముతైదుల ఆశీస్సులతో అంతానీకు శుభమే 
అటుఇటు బంధంఉన్న చుట్టాలంత మేమే 
ఎక్కడున్నా నువ్వుగాని చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడు

దేవి సీమంతం సంతసాల వంత పాడేనే 
ప్రేమా ఆనదం గుండెలోన నిండిపోయెనే 
అంగనలందరు కలిసి కోమలికి మంగళహారతులనిరే
వేదము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెన లొసగె
శుభ యోగాలతో వెలిగే సాగే సుతునే కనవమ్మ (దేవి) 
 
 

  

No comments:

Post a Comment