visitors

Saturday, January 7, 2012

తరలిరాద తనే వసంతం

చిత్రం:రుద్రవీణ  సంగీతం:ఇళయరాజా
పాడినవారు:S.P.బాలు


తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాలకోసం -2
గగనాలదాకా  అల సాగకుంటే మేఘాలరాగం ఇలా చేరుకోద (తరలిరాదా)

వెన్నెలదీపం కొందరిదా అడవిని సైతం వెలుగుకదా -2
ఎల్లలులేని చల్లనిగాలి అందరికోసం అందును కదా
ప్రతిమదిని లేపే ప్రభాతరాగం పదేపదే చూపే ప్రధానమార్గం
ఏదీసొంతంకోసం కాదనుసందేశం పంచెగుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిసమెరుగని గమనము కదా (తరలిరాద)

బ్రతుకునలేని శృతికలదా ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైనా ఏ కలకైనా  జీవితరంగం వేదికకాదా
ప్రజాధనంకాని కళావిలాసం  ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసేకోయిల పొతే కాలంఆగిందా  పారే ఏరేపాడే  మరోపదంరాదా
మురళికి కల స్వరముల కల పెదవిని విడి పలుకము కదా (తరలిరాద)


No comments:

Post a Comment