చిత్రం: ఉండమ్మా బొట్టు పెడతా సంగీతం: KV మహదేవన్
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి పాడినవారు :సుశీల
అడుగడుగున గుడి వుంది అందరిలో గుడి వుంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం (అడుగడుగున)
ఇల్లూ వాకిలి ఒళ్ళూ మనసూ ఈశుని కొలువనిపించాలి - 2
ఎల్లవేళలా మంచుకడిగిన మల్లెపూవులా ఉంచాలి - 2
దీపం మరిమరి వెలగాలి తెరలు పొరలు తొలగాలి (అడుగడుగున)
తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం - 2
కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం - 2
ప్రతి మనిషి నడిచే దైవం ప్రతి పులుగు ఎగిరే దైవం (అడుగడుగున)
థాంకులు చెల్లీ...అదే చేత్తో ఈ పాటలు పాడి మీ వాడికి వినిపించమని మనవి...:)
ReplyDeletesure sis... i'll do it...
ReplyDelete