visitors

Friday, January 6, 2012

రాలిపోయేపువ్వా నీకు రాగాలెందుకే

రాలిపోయేపువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్నాలెందుకే లోకమేన్నాడో చీకటాయేలే
నీకిది తెలవారని రేయమ్మా కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీరాగం ( రాలిపోయే)

చెదిరింది నీ గూడు గాలిగా చిలకాగోరింకమ్మ గాధగా చిన్నారిరూపాలు కన్నీటిదీపాలుకాగా 
తనవాడు తారల్లో చేరగా మనసుమాంగాల్యాలు జారగా సింధూరవర్ణాలు తెల్లారిచల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై  ఆశలకే హారతివై  (రాలిపోయే)

అనుభందమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంతరాగాల చేమంతులే వాడిపోయే
తనరంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే  కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగతెగే వీణియవై (రాలిపోయే)


No comments:

Post a Comment