visitors

Wednesday, January 11, 2012

అలైపొంగెరా కన్నా

చిత్రం: సఖి   సంగీతం: A R రెహ్మాన్
పాడినవారు:  హరిణి, కల్యాణి, మహాలక్ష్మి అయ్యర్

అలైపొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనందమోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానసమలై పొంగెర నీ నవరసమోహన వేణుగానమది  (అలై)
నిలబడివింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదురా -2 
ప్రాయమున యమునా మురళీధర యవ్వనమలై పొంగెరా

కన్నులవెన్నెల పట్టపగాల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచుముత్యాలు వెలిగే
కన్నెమోమున కనుబోమ్మలటు పొంగే
కాదలి వేణుగానం కానడ పలికే -2 
కన్నెవయసు కళలోలికే వేళలో
కన్నెసొగసు ఒకవిధమై ఒరిగేలే
అనంతమనాది వసంతపదాల సరాగా సురాగా స్వరాలివా
విశాంత మహీచ శాకుంత మరందమెడారి గళాన వర్షించవా
ఒకసుగంధవనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా-2 
కడలికి అలలకు కథాకళి కళలిడు శశికిరణంవలె చలించవా
చిగురు సొగసులను పైరుటాకులకు రవికిరణాలై రచించవా
కవితమదిని రగిలే ఆవేదన ఇతర భామలకులేని వేదన -2 
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువుల వలపులే  చిలుకు మధుర గాయ విరిగేయము పలుకగా (అలై)




No comments:

Post a Comment