visitors

Saturday, January 7, 2012

సొగసు చూడ తరమా

చిత్రం:Mr.పెళ్ళాం   సంగీతం: M.M.కీరవాణి 
రచన: ఆరుద్ర  పాడినవారు: S.P.బాలు 


సొగసుచూడతరమా సొగసుచూడతరమా
నీ సొగసుచూడతరమా నీ సొగసుచూడతరమా
నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు ఎర్రన్నికోపాలు ఎన్నెల్లోదీపాలు
అందమే సుమా.......(సొగసు)

అరుగుమీద నిలబడి నీ కురులను దువ్వేవేళ
చేజారిన దువ్వెన్నకు బేజారుగా వంగినపుడు
చిరుకోపం చీరగట్టి సిగ్గును చెంగునదాచి
భగ్గుమన్న చక్కదనం పరుగో పరుగేట్టినపుడు.......(సొగసు)

పెట్టీపెట్టనిముద్దులు యిట్టెవిదిలించికొట్టి
గుమ్మెత్తే సోయగాలు గుమ్మాలను దాటువేళ
చెంగుపట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే
తడిబారిన కన్నులతో విడువిడుమంటున్నప్పుడు
విడువిడుమంటున్నప్పుడు.....ఆఆ (సొగసు)

పసిపాపకు పాలిస్తూ పరవశించి వున్నప్పుడు
పెదపాపాడు పాకి వచ్చి మరి నాకో అన్నపుడు
మొట్టికాయ వేసి ఛిపొండి అన్నప్పుడు 
నాఏడుపు నీనవ్వులు హారివిల్లై వెలసినపుడు 

సిరిమల్లెలు హరివిల్లగు జడలో తురిమి క్షణమే యుగమైవేచివేచి
చలిపొంగులు తెలికోకల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులువాచీ  
నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవు అందాలతో 
త్యాగరాజకృతిలో  సీతాకృతిగల ఇడువంతి  (సొగసు)

No comments:

Post a Comment