visitors

Thursday, January 5, 2012

కల్యాణం కానుంది కన్నె జానకికి వైభోగం రానుంది రామచంద్రునికి
దేవతలే దిగి రావాలి జరిగే వేడుకకి
రావమ్మ సీతమ్మ సిగ్గుదొంతరలో  రావయ్య రామయ్య పెళ్లి శోభలతో
వెన్నెల్లో నడిచే మబ్బుల్లగా వర్షం లో తడిసే సంద్రం లాగ
ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో  అంతా సౌందర్యమే అన్ని నీకోసమే  (వెన్నెల్లో)

నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవి
నీతో ఎన్ని చెప్పిన మరెన్నో మిగులుతున్నవి
కళ్ళలోనే వాలే నీలాకాశం అంతా ఇలా వోదిగిందా
ఆడతనాన్ని ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి చూస్తూనే నిజమై అవి ఎదుటే నిలిచాయి
ఆణువణువూ అమృతం లో తడిసింది  అద్భుతం లా (వెన్నెల్లో)

యిట్టె తరుగుతున్నది మహా ప్రియమైన ఈ క్షణం
వెనుకకు తిరగనన్నది ఎలా కాలాన్ని ఆపడం
మదిలో మంటే నేడు తియ్యని స్మృతిగా  మారి ఎటో పోతోంది
కావాలంటే చూడు ఈ ఆనందం  మనతో  తను వస్తుంది
ఈ హాయి అంతా మహాభద్రం గా దాచి పాపాయి చేసి నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లె నీ చేతికివ్వలేనా

ఆకాశం అంతఃపురమయ్యింది  నాకోసం అందిన వరమయ్యింది
రావమ్మా మహారాణి ఏలమ్మ కాలాన్ని అంది ఈ లోకమే
అంతా సౌందర్యమే

No comments:

Post a Comment