చిత్రం:అభినందన సంగీతం:ఇళయరాజా
పాడినవారు:SP బాలు
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం -2
చేసినాను ప్రేమ క్షీరసాగర మధనం మింగినాను హాలాహలం (ప్రేమ)
ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్లని ఎదలో ముళ్ళు కన్నీరులై కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణం (ప్రేమ)
నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి
మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము
ఆపుడాగాలి ఈ మూగగానం (ప్రేమ)
No comments:
Post a Comment